VIDEO: 'పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి'
ELR: బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో ఇవాళ జరిగిన టీడీపీ నాయకుల సమావేశంలో రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.