'గర్భవతిని చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా!'

'గర్భవతిని చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా!'

'నన్ను తల్లిని చేసే పురుషుడికి.. రూ.25 లక్షలు ఇస్తా' అనే ఓ వీడియోను సోషల్ మీడియాలో చూసి 44 ఏళ్ల వ్యక్తి మోసపోయాడు. ఓ మహిళ సీరియస్ వాయిస్‌తో తనకు పురుషుడు కావాలని.. తాను తల్లి అయితే చాలంటూ ఉన్న వీడియోను పుణెకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ చూశాడు. ఇది నిజమేనని నమ్మి.. అందులో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే.. సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.11లక్షలు దోచేశారు.