'ఇట్లు మీ ఎదవ' నుంచి మరో సాంగ్ రిలీజ్

త్రినాథ్ కటారి స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ 'ఇట్లు మీ ఎదవ'. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'జాను ఓ మేరీ జాను' అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీలో సాహితీ అవంచ హీరోయిన్‌గా నటించింది. R.P. పట్నాయక్ మ్యూజిక్ అందించారు.