సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.42 లక్షల సాయం అందజేత
NTR: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తాజాగా రూ.42 లక్షల ఆర్థిక సహాయం 53 మంది లబ్ధిదారులకు మంజూరైనట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. జి.కొండూరు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులతో పాటు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ)లను, సీఎం సందేశ పత్రాలను శుక్రవారం లబ్దిదారులకు అందజేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.