ప్రతి అభ్యర్థి బాధ్యతగా వ్యవహరించాలి: సీపీ
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియూత వాతావరణంలో జరిగేందుకు ప్రతి అభ్యర్థి బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ అన్నారు. ఈ మేరకు ఖమ్మం రూరల్ మండల గ్రామపంచాయతీ ఎన్నికల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకమని, వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా అందరూ సమన్వయం పాటించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.