ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
JGL: పలు సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల వద్ద నుంచి 63 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌లు బిఎస్ లత, రాజా గౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు పాల్గొన్నారు.