డెంగ్యూతో బాలుడు మృతి

డెంగ్యూతో బాలుడు మృతి

NGKL: ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లికి చెందిన బాలుడు శశివర్ధన్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. వర్షాకాలంలో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.