'ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి'

'ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి'

కృష్ణా: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం నిన్న జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణయ్యతో కలిసి జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు గురించి కలెక్టర్ చర్చించారు.