VIDEO: వడ్ల లారీలో చెలరేగిన మంటలు

VIDEO: వడ్ల లారీలో చెలరేగిన మంటలు

JN: బచ్చన్నపేట మండలం అలిపురం వద్ద వడ్ల లోడుతో వెళ్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ ఇంజిన్ భాగం పూర్తిగా దగ్ధం అయింది. అప్రమత్తమైన డ్రైవర్ నిడుగొండ నాగరాజు (36) లారీ నుంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.