రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

CTR: గుడిపల్లి మండలం ఆవుల తిమ్మనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొనడంతో కోడిగాని పల్లెకు చెందిన రాధాకృష్ణ(32) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ బైకుపై గ్రామానికి వస్తుండగా కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.