'ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

KMM: ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జడ్పీ సెంటర్ బ్రాంచ్ SBI బ్యాంకు మేనేజర్ షేక్ ఇబ్రహీం అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో SBI ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని పేర్కొన్నారు.