అన్ని మతాలకు సమ ప్రాధాన్యం: శ్రీధర్ బాబు

అన్ని మతాలకు సమ ప్రాధాన్యం: శ్రీధర్ బాబు

TG: రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. తమ ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తుందని చెప్పారు. ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని వెల్లడించారు. అలాగే, ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.