ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి.. కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లాలో బస్ స్టాండ్‌లో ఆదివారం ఆర్టీసీ బస్ డ్రైవర్ బి. సుధాకర్‌పై ఆటో డ్రైవర్ ఎం.డి. షన్ దాడి చేయడంతో కలకలం రేగింది. వెనుక నుంచి డాష్ ఇచ్చిన విషయమై ప్రశ్నించడంతో ఆగ్రహంతో దాడి చేయగా, డ్రైవర్ చెవికి గాయమై రక్తస్రావం జరిగింది. పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.