ఘనంగా సీర 13వ వర్ధంతి

ఘనంగా  సీర 13వ  వర్ధంతి

SKLM: మాజీ ఎంపీపీ కి. శే. సీర నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం మందస మండలం డిమిరియా గ్రామంలో శుక్రవారం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి గౌతు శివాజీ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు ఈ కార్యక్రమానికి హాజరై సీర నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీర నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అందించిన సేవలు గూర్చి కొనియాడారు.