నకిలీ ప్రొఫైల్.. అప్రమత్తంగా ఉండండి: కమిషనర్

నకిలీ ప్రొఫైల్.. అప్రమత్తంగా ఉండండి: కమిషనర్

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ప్రొఫైల్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా అధికారి పేరుతో ఫోన్ చేసి డబ్బులు అడిగితే స్పందించవద్దని, ఎటువంటి ఆన్‌లైన్ చెల్లింపులు చేయవద్దని సూచించారు.