VIDEO: సాగునీటి కోసం సీపీఎం ఆటో జాతా ప్రారంభం

VIDEO: సాగునీటి కోసం సీపీఎం ఆటో జాతా ప్రారంభం

KRNL: ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో సీపీఎం మండల కార్యదర్శి లింగన్న బుధవారం ఆటో జాతాను ప్రారంభించారు. కౌతాళం మెలిగనూరు వద్ద వరద కాలువలు నిర్మించి ఆదోనికి సాగు, తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వేదావతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు. నవంబర్ 9, 10 తేదీల్లో జరిగే పాదయాత్రలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.