రూ.39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం
AP: CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా 1.11 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయలసీమను సౌర విద్యుత్ కేంద్రంగా మార్చాలని, ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి పెట్టాలని CM సూచించారు. సాగు వ్యర్థాల వినియోగ యూనిట్లకు బోర్డు ఓకే చెప్పింది.