'పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి'

'పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి'

MHBD: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గురువారం పోలీస్ అధికారులతో క్రైమ్ సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, అక్రమ రవాణాలు, గంజాయి నియంత్రణ చర్యలు, ప్రజాశాంతి భద్రత అంశాలపై సమగ్రంగా చర్చించారు.