నేడే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

నేడే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

TG: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇవాళ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మ.12:15 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై BRS, BJP ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారం ప్రాధాన్యత సంతరించుకుంది.