VIDEO: 'అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం'
E.G: ప్రపంచ స్థాయి వినోద సౌకర్యాలు, థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం శాసనసభలో స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతలలోని 171.14 ఎకరాల విస్తీర్ణంలో డిస్నీ వరల్డ్ తరహా ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందించారు.