'సారాయి రహిత జిల్లాగా అభివృద్ధి'

'సారాయి రహిత జిల్లాగా అభివృద్ధి'

NLR: సీఎం చంద్రబాబు ప్రారంభించిన 'నవోదయ 2.0' కార్యక్రమం కింద జిల్లాలో మద్యం నిర్మూలనకు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవి కుమార్ అన్నారు. ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు 363 కేసులు నమోదు చేసి, 396 మందిని అరెస్ట్ చేశారు. 48,000 బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు వివరించారు. 20 వాహనాలను సీజ్ చేశామని సారాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలన్నారు.