మరోసారి ఇరకాటంలో డిప్యూటీ సీఎం

మరోసారి ఇరకాటంలో డిప్యూటీ సీఎం

మహారాష్ట్ర DY CM అజిత్ పవార్ మరోసారి ఇరకాటంలో పడ్డారు. పుణెలోని కేశవ్ నగర్‌లో స్థానికులతో మాట్లాడిన అజిత్.. వారి సమస్యల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో ఓ మహిళ .. గోవాలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ సమస్యలను పరిష్కరించేవారంటూ మనోహర్ పారికర్ ప్రస్తావన తీసుకువచ్చారు. అంతలో DY CM జోక్యం చేసుకుని అసలు పారికర్ ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో ఆమె గోవా మాజీ CM అని బదులివ్వడం చర్చనీయాంశమైంది.