స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన రాజయ్య
JN: చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలోని రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్య పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.