జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన డి. శృతిక జాతీయ స్థాయి అండర్-15 వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శృతిక అద్భుతమైన ప్రతిభకనబరిచిందని పీడీ అక్బర్ బుధవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందన్నారు.