చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

కడప: ఎర్రగుంట్లలోని ముద్దనూరు రోడ్డులో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకోవడానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.