కారు ఢీ.. ముగ్గురు చిన్నారులకు గాయాలు
KRNL: దేవనకొండ(మం) కప్పట్రాళ్ల స్టేజి సమీపంలో ఇవాళ రెండు కార్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సీఐ వేణుగోపాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.