VIDEO: భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుని కల్యాణోత్సవం
CTR: సోమల మండలంలో ఆదివారం శ్రీ భూ నీలాదేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామి తిరుకళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, గణపతి హోమం, నవగ్రహ హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవత మూర్తులను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.