అమరలింగేశ్వరుని సన్నిధిలో భక్తజన సందోహం
PLD: అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.