కుండలేశ్వరంలో పిచ్చికుక్క స్వైర్వ విహారం
కోనసీమ: కాట్రేనికోన మండలం కుండలేశ్వరం కెనాల్ రోడ్డు అంబేద్కర్ బొమ్మ సమీపంలో ఇవాళ ఉదయం పిచ్చికుక్క స్వైర్వ విహారం చేసిందని స్థానికులు అంటున్నారు. వాహనదారులను వెంబడించి కరుస్తుందని, అటువైపు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా సూచించారు. వీలైతే వేరే దారిలో వెళ్ళడం మంచిదని స్థానికులు తెలిపారు.