మార్కెట్ యార్డులో భారీగా పెరిగిన నిమ్మ ధరలు
NLR: జిల్లాలోని పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో ధరలు భారీగా పెరిగాయి. గత శుక్రవారం బస్తా రూ.10 వేలు ఉండగా.. ఇవాళ నాణ్యతను బట్టి రూ.11వేల నుంచి రూ. 12 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. నిమ్మ ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.