ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 4.5గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 150 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.