VIDEO: లోయలోకి దూసుకెళ్లిన బైక్
ASR: అడ్డతీగల మండలంలోని చేనుపాకలు గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అడ్డతీగలకు చెందిన సురేష్ బైక్‌పై చేనుపాకలు వైపు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సుమారు 40 మీటర్ల లోయలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి కాళ్లు, ముఖంపై గాయాలు అయ్యాయి. దీంతో అతడిని 108 అంబులెన్స్‌లో అడ్డతీగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.