ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BDK: మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామానికి చెందిన అంకాల హైమావతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నూతన గృహాన్ని నిర్మించుకుని ఈరోజు గృహప్రవేశ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై నూతన గృహంలో పూజా నిర్వహించి హైమావతికి శుభాకాంక్షలు తెలియజేశారు.