అమెరికా బలగాలపై ఇరాన్ 'ఫతా-2' అటాక్!
అమెరికా బలగాల లక్ష్యంగా జరిగిన దాడుల్లో తొలిసారిగా 'ఫతా-2' హైపర్ సోనిక్ క్షిపణిని ఉపయోగించినట్లు ఇరాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ అత్యాధునిక క్షిపణిని వాడటం ఇదే మొదటిసారి. ఈ పరిణామంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా స్థావరాలపై దాడుల ప్రభావంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.