'చిన్నారుల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ తీవ్ర ప్రభావం'
కోనసీమ: చిన్నారుల ఆరోగ్యంపై జంక్ ఫుడ్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని ఐసీడీఎస్ పీవో యు. పూర్ణిమ తెలిపారు. రాయవరం మండలం సోమేశ్వరంలో గురువారం జరిగిన పోషణ పక్వాడ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సెల్ ఫోన్ చూపిస్తూ ఆహారం తినిపించడం వల్ల పిల్లలలో ఊబకాయం వస్తుందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలన్నారు.