పెంకుటిల్లు కాదు.. ప్రభుత్వ బడే..!
ADB: గిరిజన సంక్షేమ పాఠశాల ఓ పెంకుటిల్లులో కొనసాగుతోంది. లింగాపూర్(M) హీరాపూర్ గ్రామంలోని విద్యార్థులు పాఠశాల లేక 3KM దూరంలో ఉన్న షీక్లాతండాకు వెళ్లి చదువుకుంటున్నారు. మారుమూల గ్రామం కావడంతో అక్కడ ప్రభుత్వ భవనాలేమి లేవు. దీంతో అధికారులు ఈ విద్యా సంవత్సరం మధ్యలో ఖాలీగా ఉంటున్న ఓ పాత ఇంటిని పాఠశాలగా మార్చారు. ఈ పాఠశాలలో 1-5 తరగతి వరకు మొత్తం 17 మంది విద్యార్థులు ఉన్నారు.