VIDEO: జగన్ గెలుపుకై మోకాళ్లపై వెళ్లిన అభిమాని
HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తుజ్యోతి మందిరంలో వైఎస్ జగన్ రెండోసారి సీఎం కావాలని బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన బొడ్డు ప్రవీణ్ గురువారం ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. మోకాళ్లపై నడుచుకుంటూ చర్చి లోపలికి వెళ్లి ప్రార్థనలు నిర్వహించాడు. రాబోయే రోజుల్లో భద్రాచలం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేయనున్నట్లు పేర్కొన్నాడు.