ఈ నెల 11న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

BNR: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 11న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శోభారాణి తెలిపారు. సభ్యులు ఈ సమావేశానికి సకాలంలో హాజరుకావాలని ఆమె తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు తమ నివేదికలతో సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు.