కోర్టు మెట్లెక్కిన ఇళయరాజా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫొటోలను వినియోగిస్తున్నారని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన ఫొటోలను ఇతరులెవరూ ఉపయోగించకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రముఖ నటులు కూడా ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.