'అఖండ-2' ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ 2'. ఈ సినిమాలోని 'తాండవం' ఫస్ట్ సింగిల్ ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను లెజెండరీ సింగర్స్ శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించగా, SS తమన్ సంగీతం అందించాడు. ఈ నెల 9న పూర్తీ పాట విడుదల కానుంది. కాగా, ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.