'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
AKP: వైసీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ సూచించారు. కొత్తగా నియమితులైన కోటవురట్ల మండలం వైసీపీ అధ్యక్షుడు పైల రమేష్, రాష్ట్ర ఎస్సీ సెల్ సహాయ కార్యదర్శి అనిల్ కుమార్ సోమవారం నర్సీపట్నంలో గణేష్‌ను కలిశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు.