మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా కలెక్టర్
సత్యసాయి: హిందూపురం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ శ్యాం ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో కొత్త ఎన్నికలు జరిగే వరకు మున్సిపాలిటీ పరిపాలనను కలెక్టర్ ప్రత్యేక అధికారిగా నిర్వహించనున్నారు. పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ శుభ్రత అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన తెలిపారు.