నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం
NZB: బాల్కొండలోని పిప్రీ గ్రామంలో నూతన ఆర్యోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను నివారించవచ్చని, బీపీ, షుగర్ నియంత్రణతో ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమని తెలిపారు. వైద్యులు ఈసీజీ పరీక్షలతో గుండె ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలని సూచించారు.