ప్రత్యేక అలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి

ప్రత్యేక అలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి

NDL: ఉగాది పండుగ సందర్భంగా నందవరం శ్రీచౌడేశ్వరి దేవి ఆలయంలో గురువారం అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, రుద్రాభిషేకం, మహామంగళహారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.