'మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'
CTR: అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని పుంగనూరు కోర్టు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జ్ కృష్ణవంశీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అలాగే ప్రభుత్వపరంగా వారికి ఇచ్చే సదుపాయాలను పేద మహిళలకు చెందిన ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.