ఉక్రెయిన్‌ డ్రోన్ల కోసం గల్ఫ్‌ దేశాల ఒప్పందం

ఉక్రెయిన్‌ డ్రోన్ల కోసం గల్ఫ్‌ దేశాల ఒప్పందం

అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాల్లో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే ఉక్రెయిన్ డ్రోన్లను కొనేందుకు గల్ప్ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో ఖతార్, UAE, సౌదీ ఉక్రెయిన్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పటికే జోర్దాన్, కువైట్‌లకు వందలాది ఆయుధాలు అందినట్లు సమాచారం.