సురేష్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

సురేష్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

MBNR: జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.