తెనాలిలో ఆటో డ్రైవర్ల నిరసన
GNTR: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ద్వారా తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో మంగళగిరి ఆటో పాయింట్ వద్ద సోమవారం ఉదయం నిరసనకు దిగారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమకు రోజుకి రూ. 100 ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.