దళిత సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు శ్రీకారం
జగిత్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రేపు జరగనున్న జయంతి వేడుకల్లో ప్రజలు భారీగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.