'టీడీపీ నాయకుడికి నివాళులర్పించిన ఎంపీ'
NDL: జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామానికి చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అభిమాని, టీడీపీ నాయకుడు తిరుమలరావు (60) గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం తంగడంచకు చేరుకుని తిరుమలరావు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బైరెడ్డి అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.